వరంగల్‌లో ఐస్ క్రీంలో వీర్యం కలిపి అమ్మిన వ్యక్తి, వైరల్ అవుతున్న వీడియో.

నెక్కొండ మండల చుట్టుపక్కలా బాలాజీ కంపెనీ పేరుతో కొంతకాలంగా ఫలుదా ఐస్ క్రీమ్ బిజినెస్ నడుస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఐస్ క్రీం అమ్మె వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం కలిపి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత శీతలపానియాలు, ఐస్ క్రీంలు తినాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.

అయితే వరంగల్‌ జిల్లా నెక్కొండ మండంలో ఓ వ్యాపారి మూత్రం, వీర్యం కలిపి ఐస్‌క్రీం విక్రయిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపింది. విక్రయదారుడు హస్తప్రయోగం చేస్తూ తన వీర్యాన్ని ఐస్‌క్రీమ్‌లో కలుపుతున్నట్లు మార్చి 19, మంగళవారం నాడు సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది.

కల్తీ ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి విక్రయించినందుకు గాను విక్రేతను నెక్కొండ పోలీసులు అరెస్టు చేశారు. నెక్కొండలో అసభ్యంగా ప్రవర్తించిన రాజస్థాన్ వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెక్కొండ మండలం రాజస్థాన్‌కు చెందిన కలురామ్ కుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్‌లో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు శాంపిల్ తీసుకున్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు కాలురామ్ కుర్బియాపై చట్టబద్ధంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సెక్షన్ 294 ఐపిసి, కేసు నంబర్ 48/2024 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *