ఆ భయమే ప్రాణం తీసిందా..! లాస్య ఒంటిపై 12 తాయత్తులు, మృతికి అసలు కారణమిదే..!

రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత తలకు బలమైన గాయాలు అయ్యాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. బలమైన గాయాలు కాడంతోనే స్పాట్‌లోనే చనిపోయినట్లు వెల్లడించారు.
శరీరంలోనిఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. పక్కటెముకలు, తొడ ఎముకలతో పాటు ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్‌‌పై ఇవాళ తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

37 ఏళ్ల లాస్య నందిత కారులో కూర్చొని ఉండగా.. ఆమె ఫ్రెండ్, పీఏ అయిన ఆకాష్ కారు డ్రైవ్ చేశారు. ఐతే.. పటాచ్‌చెరు దగ్గర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు రైలింగ్‌ని ఢీకొట్టడంతో లాస్య నందిత స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందిత మృతదేహానికి గాంధీ వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సమయంలో ఆమె మృతదేహానికి 12 తాయత్తులను గుర్తించిన వైద్యులు వాటిని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యానికి గురై కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఆ తర్వాత ఓ కార్యక్రమానికి హాజరై మూడున్నర గంటల పాటు లిఫ్ట్ లో చిక్కుకున్నారు. ఈనెల 13న నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదలో ఆమె మృత్యుచేతికి చిక్కారు. ఇదిలా ఉంటే వరుస ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడేందుకు లాస్య నందిత తాయత్తుల సెంటిమెట్ ను నమ్ముకున్నారా? చివరకు ఆ తాయత్తు కోసమే వెళ్ళి వస్తూ ప్రాణాలు కోల్పోయారా అనే చర్చ తెరమీదకు వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *