కూతురు మృతి తర్వాత విజయ్ ఆంటోనీ భార్య సంచలన నిర్ణయం. ఇక నా వల్ల కావట్లేదు.

విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఒంటరి తనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పట్లో ఈ విషయం విజయ్ అభిమానులతో పాటు చాలా మందిని బాధించింది.ముఖ్యంగా విజయ్ కుటుంబ సభ్యులు అయితే ఆ సంఘటన నుంచి ఇంకా కోలుకులేదు. అయితే విజయ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. విజయ్ ఆంటోనీ నిర్మాణ సంస్థ పనులు చూసుకుంటూ ఫాతిమా ఆంటోనీ కూడా బిజీగా ఉంది.

వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా కూతురి మరణాన్ని మర్చిపోలేకపోతున్నారు ఈ జంట. తాజాగా విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఆంటోనీ తన కూతురి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కూతురు మీరాతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫాతిమా ఆంటోనీ.. మీరా, నీ పియానో నీ టచ్ లేక బాధపడుతుంది. నువ్ లేవని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. ఈ ప్రపంచం నీ కోసం కాదేమో. కానీ అమ్మ ఇంకా ఇక్కడే ఉంది.

ఈ చావు బతుకుల మధ్య గీత నాకు అర్ధం కావట్లేదు. నిన్ను కలిసేదాకా బ్లాంక్ గానే ఉంటాను. అక్కడ బాగా తిని రెస్ట్ తీసుకో, నిన్ను మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా పలువురు అభిమానులు, నెటిజన్లు బాధపడకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *