దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తూ ఇటీవల సస్పెండ్‌కు గురయిన శాంతికి, ఆమె భర్త మదన్ మోహన్ మధ్య తెగదెంపులు అయ్యాయి. అయితే ఇటీవల మదన్‌మోహన్ భన భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డితో లైంగిక సంబంధం ఉందని మదన్ మోహన్ ఆరోపణలను చేయడాన్ని ఖండించారు.
విజయవాడలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు మదన్ మోహన్‌కు కొన్నేళ్ల కిందటే సంబంధాలు తెగిపోయాయని శాంతి స్పష్టం చేశారు. డబ్బు కోసమే తనపై మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశాడని మీడియా ముఖంగా ఆమె బోరున విలపించారు. అతడితో విడిపోయాక తాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విజయ సాయిరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ..
‘నేను విశాఖపట్నంలో పని చేసినప్పుడు వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇంచార్జి కావడంతో డ్యూటీ విషయంలో కలిశాను. కలసినంత మాత్రానా ఆయనతో నాకు లైంగిక సంబంధం అంటగడతారా? ఇది పద్ధతి కాదు’ అని విలపిస్తూ శాంతి తెలిపారు. విజయసాయి రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.