ప్రపంచ కుభేరులు అంబానీల ఇంట అట్టహాసంగా వివాహ మహోత్సవం జరిగింది. ఆకాశమే పందిరిగా, భూలోకమే పెళ్లి పీటలుగా వేసారా అన్నట్లుగా ఏర్పాట్లు వుంటాయి. ఇక కోట్లాది మంది అభిమానించే సినీతారలు, క్రీడాకారులు… ఆదర్శంగా తీసుకునే వ్యాపారవేత్తలు… దేశాన్ని పాలించేవారు… ఇలా ఒక్కరేమిటి అన్నిరంగాల ప్రముఖులంతా ఆ పెళ్లిలోనే కనిపిస్తారు.
అయితే ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముఖేష్ అంబానీ, నితా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధిక మర్చంట్ తో శుక్రవారం ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ వివాహ వేడుకకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలను ఆహ్వానించారు. ఆకాశమంత పందిరి..భూదేవంత వాకిలిగా అనంత్, రాధిక పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
అయితే ఈవివాహానికి వ్యాపార, క్రీడా, సినీ, విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో తరలిరానున్నారు.ఒక్కటిగా కాబోతున్న ఈ జోడిని ఆశీర్వదించనున్నారు.అంబానీ ఇంటి పెళ్లి ఆహ్వానం అందుకున్న భారతీయ సెలబ్రిటీల విషయానికి వస్తే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మమతా బెనర్జీతో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.