సోమవారం రోజు చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే చెప్పారు. అయితే శనివారం రోజు ఉదయం చనిపోయిన ఆయనకు సోమవారం రోజు అంటే మూడ్రోజులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు ఆయన అంత్యక్రియలు ఆలస్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారని చాలా మందికి అనుమానం వస్తోంది. అయితే ఇలా ఆలస్యంగా చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
చంద్ర మోహన్, జలంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఆవిడ సైకాలజిస్ట్. రెండో అమ్మాయి పేరు మాధవి. ఆవిడ చెన్నైలో సెటిల్ అయ్యారు. మధుర మీనాక్షి అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ రావడం కోసం సమయం పడుతుంది. అందుకని, రెండు రోజులు ఆలస్యంగా అంత్య క్రియలు నిర్వహించాలని చంద్ర మోహన్ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
హైదరాబాద్ సిటీలో చంద్ర మోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఆయనకు కడసారి వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం వేళల్లో ఆయన దహన సంస్కారాలు నిర్వహిస్తారని సమాచారం. చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకుల సందర్శనార్థం పార్థీవ దేహాన్ని ఆదివారం లేదా సోమవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకు రావచ్చు.