సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యరాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.
అయితే ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి అనగానే అందరికీ గుర్తొచ్చేవి సెలబ్రిటీల జాతకాలు. సినీ నటుల జాతకాలు పబ్లిక్ గా చెబుతూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇటీవలి కాలంలో అయితే నెట్టింట ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. నాగచైతన్య, సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లు తిరగక ముందే చైతూ, సమంత విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది.
ఆ తర్వాత వేణు స్వామి జాతకంపై అందరిలో నమ్మకం పెరిగింది. ప్రముఖ హీరోయిన్లు అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన్నలకు వివాహం అచ్చిరాదంటూ కూడా వేణు స్వామి చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఇలా సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో హాట్ టాపిక్ అయిన వేణు స్వామి పర్సనల్ లైఫ్ తాలూకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరి జ్యోతిష్యాలు చెప్పే వేణు స్వామి జీవితంలో కూడా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది.