ప్రతీరోజూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి మరణించారు. అదే సమయంలో స్టార్ నటుడు నాజర్ తండ్రి కూడా వయసు సంబంధిత సమస్యలతో మరణించారు. అటు తర్వాత మలయాళ నటుడు కుందర జానీ, విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు,బాలీవుడ్ నటి భైరవి, ‘సింగం’ దర్శకుడైన హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్,
శృంగార నటి బాబిలోనా సోదరుడు విక్కీ,హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన కమెడియన్ మాథ్యూ పెర్రీ,నటి డా.ప్రియ వంటి వారు కన్నుమూశారు. అయితే కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అర్పుదాన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. చికిత్స పొందతూ మరణించారు. సోమవారం సాయంత్రం మృతి చెందగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైడ్ డ్యాన్సర్‌గా కెరీర్ మొదలు పెట్టిన హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ లైఫ్ ఇచ్చిన దర్శకుడు ఆయన. 2002 అర్పుతం సినిమాతోనే లారెన్స్ హీరోగా మారాడు.

ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మిమ్స్ నిర్మించింది. ఈ మూవీ లారెన్స్ కెరీర్‌కు పునాది వేసింది. శ్యామ్ తో మనతోడు మజైకాలం అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు అర్పుదాన్. తెలుగులో ఉదయ్ కిరణ్ తో కలిసి లవ్ టుడేను తెరకెక్కించారు. ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడిన ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మరణించారు.