సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కీరవాణి, తేజ, శివాజీ రాజా, విజయ్ దేవరకొండ, నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ రామ్, సుమంత్.. ఇలా ఒక్కొక్కరిగా తమ ఓటుని వేసి వస్తున్నారు. అయితే తెలంగాణలో ఓట్ల పండగ జోరుగా సాగుతోంది. గురువారంఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.
సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయిస్తున్నా ఓపికగా క్యూ లైన్లలో నిలబడి మరీ తమ ఓటు బాధ్యతను పూర్తి చేసుకుంటున్నారు. పాఠశాల విద్య నుంచే ఓటు విలువను తెలియజేయాలన్నారు ప్రముఖ దర్శకుడు రాఘ వేంద్రరావు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడిన దర్శకేంద్రుడు మనం ఏది అడగాలన్నా ఓటు వేసే హక్కు ఉండాలన్నారు.
ఇక వెంకటేష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ఉదయాన్నే హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు. షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో సతీమణి రమతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే దర్శకుడు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు.