911 పోలీస్ వాహనం అతి వేగంతో వచ్చి ఢీకొనడంతో.. 100 అడుగులు ఎగిరిపడ్డ జాహ్నవి స్పాట్లో మృతి చెందింది. ఆ సమయంలో 911 పోలీస్ వాహనాన్ని అతివేగంతో కెవిన్ డేవ్ అధికారి అతి వేగంతో నడిపారు. ఈ ఏడాది జనవరిలో జరిగిందీ ఘటన. ఆమె లేదన్న బాధను ఇంకా కుటుంబ సభ్యులు జీర్ణించుకోనేలేదు. ఈ లోపే.. అక్కడి పోలీసు ప్రవర్తన గురించి తెలియడంతో వారు మరింత తల్లిడిల్లిపోతున్నారు. అయితే అమెరికాలోని సియాటెల్ లో పోలీసుల కారు ఢీకొని మరణించిన కందుల జాహ్నవి కేసు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఘటన జనవరి 23న జరిగింది.
ఆమె మరణంపై సియాటెల్ పోలీసులు చాలా హేళనగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించి వారి మాటలు బాడీ కెమెరాలో రికార్డు అవ్వడం.. అలాగే అందుకు సంబంధించి ఆ క్లిప్ లు బయట పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కందుల జాహ్నవి ఎవరూ అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకు అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కందుల జాహ్నవి (23) ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమెకు అమెరికాలోని సౌత్ లేక్ యూనియన్ లో ఉన్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ లో సీటు వచ్చింది.
అక్కడే మాస్టర్స్ డిగ్రీ చేసేది. అయితే స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా జాహ్నవి 2021లో అమెరికాకు పయనమైంది. జాహ్నవి తల్లి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు వాళ్ల కుటుంబానికి అప్పుల భారం కూడా పెరిగిపోయింది. అమెరికాలో ఉన్నత విద్య తర్వాత ఉద్యోగంలో చేరి అమ్మ చేసిన అప్పులు తీర్చాలనుకుంది జాహ్నవి. తన మొదటి ప్రాధాన్యత కుటుంబానికి సాయపడడమే అనే అనుకుంది. కానీ అంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. జనవరి 23న డెక్స్ టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ కూడలి వద్ద జాహ్నవి రోడ్డు దాటుతూ వెళ్తోంది.
అయితే అదే సమయంలో అక్కడికి వేగంగా ఓ పోలీసు పెట్రోలింగ్ కారు దూసుకొచ్చింది. ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో రోడ్డు దాటుతున్న జాహ్నవిని అకస్మాత్తగా ఢీకొట్టింది. దీంతో ఆ వేగానికి జాహ్నవి ఏకంగా 100 అడుగుల దూరంలో ఎగిరి పడిపోయింది. ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్కు తరలించారు. కానీ జాహ్నవి ప్రాణాలు విడిచింది.