వరలక్ష్మీ.. తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ కూతురు. అంటే రాధిక వరలక్ష్మి తల్లి కాదు. శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి. ఇది అలా ఉంటే తన సవతి తల్లి రాధిక గురించి వరలక్ష్మీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వరలక్ష్మీ తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిందనే చెప్పాలి.
అయితే వరలక్ష్మి.. శరత్ కుమార్ – చాయా దంపతులకు జన్మించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమె తండ్రి సీనియర్ హీరోయిన్ రాధికను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి సవతి తల్లితో వరలక్ష్మి సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. రాధికలో నిజమైన తల్లిని చూసుకుంటూ ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకుంది. అందుకే వీళ్లు కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు.

సెన్సేషనల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్‌ను ఇటీవలే న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో తన వ్యక్తిగత, వృత్తి పరమైన ఎన్నో విషయాలను బయట పెట్టింది. అలాగే, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే సవతి తల్లి రాధికపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.