మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత కొన్ని రోజులు సినిమాలకు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఈ బ్యూటీ.. తమిళ హీరో విజయ్ ఆఖరి చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ప్రముఖ నటి సమంత ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తన వ్యక్తిగత సిబ్బందితో వచ్చిన సమంత… వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు సమంతకు వేదాశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం సమంత ఆలయం వెలుపలికి వచ్చారు. సమంత రాకతో ఆలయం పరిసరాల్లో కోలాహలం నెలకొంది.
సమంత ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించడం తెలిసిందే. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సమంత పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
#Samantha in Tirumala Tirupati Devasthanam! 🥹♥️🧿#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/9zI8EkTMio
— 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 4, 2024