ఇండస్ట్రీలో అప్పటివరకూ తమ హవా కొనసాగిస్తున్న స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు కూడా ఉదయ్ కిరణ్ కు ఏర్పడ్డ క్రేజ్ ను చూసి షాక్ అయ్యారు. ఉదయ్ నటించిన సినిమాలకి ప్లాప్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు నమోదు చేసేవి. కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం వంటి సినిమాలు అతని ఇమేజ్ కారణంగానే బ్రేక్ ఈవెన్ సాధించాయి. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయి ఏడేళ్లు గడిచిన తర్వాత అతను రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది.
అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో.. ” విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. ఆ తర్వాత అంతగా నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడు అని అనుకుంటున్నావు.. కానీ అతను అస్సలు మంచివాడు కాదు.

నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కానీ అప్పుడు ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికా వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినీ ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు.
అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా..” అంటూ ఉదయ్ రాసినట్టుగా ఉంది.