ఆ అమెరికా అబ్బాయితో పెళ్లికి రెడీ అంటున్న రష్మీ గౌతమ్. షాక్ లో జబర్దస్త్ కమెడియన్.

అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది. డబ్బులతో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమె తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్రెట్ గానే ఆమె పెళ్లి చేసుకోవాలనుకోగా.. ఓ జబర్దస్త్ కమెడియన్ ఫ్లోలో నోరు జారాడు. అయితే రష్మీ గౌతమ్ పేరుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి అయినా.. దాదాపు దశాబ్దం కాలంగా తెలుగు ఇండస్ట్రీలో రానిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

తన డ్యాన్స్ లతో మాటలతో యూత్ గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడుకు మెజార్టీ ఫాలోవర్స్ యూత్ మాత్రమే. ఈ అమ్మడు నటిగా కెరీర్ ను ప్రారంభించినా జబర్ధస్త్ యాంకర్ గానే ఫేమ్ దక్కించుకుంది.. మరోవైపు హీరోయిన్ గా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఆ షోలో కమెడియన్ సుధీర్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఒకప్పుడు బాగా వినిపించాయి.. ఆ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చేశారు.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరోవార్త వినిపిస్తుంది.. అమెరికా అబ్బాయితో రష్మీకి పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది.

రష్మీ అమెరికా అబ్బాయినే వివాహం చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు జాతకాలు చూపించారట. త్వరలోనే అధికారికంగ పెళ్లి పై ప్రకటన వస్తుందని సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *