క్యాన్సర్ తో స్టార్ హీరోయిన్ కన్నుమూత. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ.

పూనమ్ పాండే..సర్వైకల్‌ కేన్సర్‌తో చికిత్స పొందుతూ పూనమ్ పాండే మృతి చెందిందని తెలుస్తోంది. ఇటీవలే అయోధ్య విగ్రహ ప్రతిష్టరోజు యాక్టివ్‌గా కనిపించింది. అయితే పూనమ్ పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది ఈ భామ. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది.

గతంలో చాల రకాల వివాదాస్పద కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు తరచు పంచుకునే పూనమ్ పాండే సడన్ గా చనిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆమధ్య తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త కొట్టడంతో దెబ్బలు తిన్న ఫోటోలను కూడా షేర్ చేసింది పూనమ్ పాండే.

పూనమ్ పాండే మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది నిజం కాదు ఆమె ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ పాండే చివరిగా కంగనా రనౌత్ రియాలిటీ షో లాక్ అప్‌లో కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *