చిరునవ్వుతో నాగ చైతన్యను పలకరించిన సమంత, వైరల్ అవుతున్న వీడియో.

తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల తర్వాత ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. కాగా సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒకే రంగంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఒకరినొకరు ఎదుర్కోవాల్సి రావడం అనివార్యం.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత , నాగచైతన్య ఇద్దరూ హాజరయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరూ ఒకే ఈవెంట్ కు వచ్చినా వేదికపైకి మాత్రం వేర్వేరు సందర్భాల్లో వచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’తో సమంత, నాగ చైతన్య చేతులు కలిపారు. నాగ చైతన్య నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సూపర్ హిట్ అయింది.

అదేవిధంగా సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కూడా అదే OTTలో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత నటించిన ‘సిటాడెల్ హనీ బానీ’ కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లోనే స్ట్రీమింగ్ కానుంది.తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమంత, నాగ చైతన్య, వరుణ్ ధావన్ తో సహా పలువురు ఆర్టిస్టులు పాల్గొన్నారు. నాగ చైతన్య కార్యక్రమం వేదికపైకి వచ్చి ‘ధూత’ వెబ్ సిరీస్ విజయంపై మాట్లాడారు.

‘సాగర్ (దూతలో నాగ చైతన్య పేరు) చాలా మంచి క్యారెక్టర్ కాబట్టి ఒప్పుకున్నాను’ అంటూ వెబ్ సిరీస్ సక్సెస్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ‘సిటాడెల్ హనీ బానీ’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడేందుకు సమంత వేదికపైకి వచ్చింది. ట్విస్ట్ ఏమిటంటే, వారిద్దరూ వేర్వేరు సందర్భాలలో వేదికపై కనిపించారు. కలిసి మాత్రం రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *