ఇండస్ట్రీలో మరో విషాదం, విమాన ప్రమాదంలో కూతుళ్లతో సహ హీరో దుర్మరణం.

జనవరి 4న తూర్పు కరేబియన్ లోని బెక్వియా సమీపంలోని ప్రైవేట్ ద్వీపం పెటిట్ నెవిస్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెకేషన్‏లో భాగంగా ఒలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‏లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. అయితే హీలీవుడ్ లో ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలీవర్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు.

ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. క్రిస్టయన్ ఒలీవర్ ప్రయాణిస్తున్న విమానం కరేబియన్ సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో క్రిస్టియన్ ఆయన ఇద్దరు కూతుళ్ళు దుర్మరణం చెందారు. జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఒలీవర్ ‘ది గుడ్ జర్మన్’, 2008 లో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ‘స్పీడ్ రేసర్’ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

గురువారం తన సొంత ప్లెయిన్ లో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుకు కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. విమానం కూలిపోయిన విషయాన్ని స్థానిక మత్స్యకారులు, కోస్టు గార్డులు, డైవర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటీకే విమానంలో ప్రయాణిస్తున్నవారు మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *