ప్రముఖ తమిళ నటుడుబాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న రాత్రి ఛాతీలో నొప్పి కారణంగా ఆయన చనిపోయారు. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
అయితే చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన వయసు 48. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన డేనియల్ బాలాజీ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

డేనియల్ మరణవార్త తెలుసుకున్న ప్రముఖ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఇక ఘర్షణ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన డేనియల్ తర్వాత టక్ జగదీష్‌తో పాటు పలు సినిమాలో నటించారు. ఇతడు నటించిన వడ చెన్నై, కమల్ హాసన్ రాఘవన్ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.