కొత్త అనుభవం, కొత్త పరిసరాలంటే కొంత జంకుగా ప్రవర్తిసుంటారు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు ఉపక్రమించేలా చేయనివ్వవు. అందుకే.. శోభనం రాత్రి గానీ, ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా, సున్నితంగా వ్యవహరించాలి.
లేకుంటే.. తొలి మూడు రోజుల్లోనే నవ దంపతుల మధ్య స్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవే మున్ముందు పెరిగి పెద్దవై వివాదాలకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు. నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి.
ఏ విషయానికి తొందరపడరాదు. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదు కాబట్టీ.. ఆచితూచి అడుగులు వేయాలి.