శ్రియ భార్త ఆండ్రూ అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇంగ్లీష్ తప్ప మరే భాష తెలియని ఆండ్రూ.. తెలుగులో అందరికీ నమస్కారం అంటూ పలికరించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు అని యాంకర్ ప్రదీప్ అనడంతో..
కొన్ని రొమాంటిక్ స్టిల్స్ పెట్టారు. ఈ క్రమంలో శ్రియ బుగ్గ మీద ఆండ్రూ ముద్దు పెట్టేశాడు. తానేమీ తక్కువ తిన్నానా? అన్నట్లు శ్రియ ఏకంగా ఇంగ్లీష్ కిస్ పెట్టి రెచ్చిపోయింది. దీంతో అక్కడకి వచ్చిన బుల్లితెర తారలు అవాక్కయ్యారు. ఇలా లిప్ లాక్‌లు కౌగిలింతలతో స్టేజీని హీటెక్కించారు. కానీ ఈ జంట చేసిన పనిని కొందరు తప్పు బడుతున్నారు.
కాగా, ఇటీవల ముంబైకి వచ్చిన శ్రియ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. గత ఏడాది శ్రియ తన బిడ్డకు స్పెయిన్ -బార్సిలోనాలో జన్మనిచ్చింది. ఈ పాపకు రాధ అనే పేరు పెట్టింది.