స్వాతినాయుడు..మొదట మేమిద్దరం ఫ్రెండ్స్‌గా ఉండేవారం. తర్వాత మా స్నేహం రిలేషన్‌షిప్‌లా మారింది. సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం అనిపించింది. ఆమె వీడియోల్లో, సినిమాల్లో ఏం చేసిన కెమెరా ముందు చేస్తుంది. ఇదంతా తన కెరీర్ కోసం చేస్తుంది. కెమెరా వెనక ఏమీ చేయదు.
తనది ఎంతో మంచి మనసు.. అందుకే నచ్చిందని అవినాష్ చెప్పుకొచ్చారు. అవినాష్ తల్లిదండ్రులకు నా గురించి, నేను చేస్తున్న రొమాంటిక్ వీడియోల గురించి తెలుసు. నేను స్వయంగా వెళ్లి వారితో మా పెళ్లి గురించి మాట్లాడారు. ఒప్పుకోలేదు. నా ప్రొఫెషన్, నేను చేస్తున్న వీడియోలు వారికి నచ్చలేదు.
చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు. నాకు తప్ప ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమే అన్నారు. అందుకే వారిని కాదనుకుని పెళ్లి చేసుకున్నాం… అని స్వాతి నాయుడు తెలిపారు.