పెళ్లి తర్వాత బోసి మెడతో బయటకి వచ్చిన రకుల్, వైరల్ వీడియో.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు కరోనా సమయంలో దగ్గర అయినట్లు నేరగా రకుల్ యే తెలిపింది. అయితే తమ మధ్య ఉన్నది ప్రేమే అని తెలుసుకుని ప్రపోజ్ చేసుకున్నట్లు, పెళ్లి చేసుకోవాలని భావించినట్లు మూడేళ్ల క్రితమే చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్లకు ప్రేమ విషయాన్ని బయట పెట్టిన ఈ ముద్దుగుమ్మ..

మూడు ముళ్ల వేయించుకోబోతున్న వార్తను కూడా ఎవరికీ చెప్పలేదు. సైలెంట్ గా చేసుకోవాలనుకోగా… వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి జరిగి పది రోజులు దాటగా.. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేధికగా ఓ పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేధికగా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు గురించి చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా తనకు సంబంధించిన మూడు అందమైన ఫొటోలను షేర్ చేసిన ఈమె… అందులో తన కాళ్లకు ఉన్న షూస్ హైలెట్ అయ్యేలా పెట్టింది. ముఖ్యంగా తన కాళ్లకు ఉన్న షూస్ ను చూపిస్తూ… పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కంఫర్ట్ విషయంలో ఏదీ మారలేదంటూ వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *