ఈమె పేరు శాంతి అయినప్పటికీ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టాక నిర్మలగా మార్చుకుంది. అప్పట్లో ఈమె క్రేజీ హీరోయిన్.ఈమె తమిళనాడు కి చెందిన అమ్మాయి అయినప్పటికీ.. తమిళ్ తో పాటు.. మలయాళం, తెలుగు, కన్నడ.. భాషల్లో కలిపి 200లకు పైగా సినిమాల్లో నటించింది.అయితే ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. నేను తెలుగులో ఎన్నో సినిమాలలో నటించాను. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా తెలుగు సినిమాలో నటించాను.
అయితే ఒకసారి అలా తెలుగులో నటిస్తున్నప్పుడు షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లో నిద్రపోతున్నాను.. రాత్రి సమయంలో ఆ సినిమా హీరో వచ్చి తలుపు కొట్టాడు.. మీరు తలుపు తీయండి.. నేనేం చేయను.. మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతా అన్నాడు. అప్పటికే ఆయన ఫుల్లుగా మందు తాగి మత్తులో మాట్లాడారు.. ఆ ఘటనతో నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత వెంటనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను.

ఇక దర్శకనిర్మాతలు నన్ను ఎంతలా కన్విన్స్ చేసినప్పటికీ కూడా నేను ఒప్పుకోలేదు.. ఇక నేను అసలు వీటిని సహించను అంటూ వెల్లడించింది.. ఇకపోతే ఆ నటుడు పేరు మాత్రం బయటకు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. అయితే వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైనా తెలుగు నటుడి నుంచి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది వెన్నెర ఆడై వెన్నెల.