అందం కోసం సర్జరీ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయిన స్టార్ హీరోయిన్‌.

సర్జరీ చేస్తుండగా నాలుగు సార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ అవ్వడంతో ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని సావోపాలోకు చెందిన 29 ఏళ్ల లూనా ఆడ్రెడ్‌ హాలీవుడ్‌ సినిమాల్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఇంకా మంచి ఆఫర్స్‌ రావాలంటే తన అందం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భావించిన లూనా కాస్మటిక్‌ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడిరది. అయితే సర్జరీ సందర్భంగా ఆమెకు నాలుగు సార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చింది.

దీంతో ఆమె కన్నుమూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సావోపాలోకు చెందిన 29 ఏళ్ల లూనా ఆడ్రెడ్‌ సినిమాల్లో ఇప్పుడిప్పుడే రానిస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే మరింత అందంగా కనిపించాలని ఆమె భావించారు. ఇందుకోసం కాస్మటిక్‌ సర్జరీలు చేయించుకోవడానికి సిద్ధం అయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆమెకు కాస్మటిక్‌ సర్జరీ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ సారి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైంది.

వైద్యులు ఆమెకు సీఆర్‌పీ చేసి మామూలు స్థితికి తీసుకువచ్చారు. కొద్ది సేపటి తర్వాత వరుసగా మూడు సార్లు కార్డియాక్‌ అరెస్ట్‌కు గురయ్యారు. దీంతో ఆమెను రక్షించడానికి డాక్టర్లు ఎంతగానో ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ లూనా కన్నుమూశారు. లూనా మరణ వార్త చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఇక, సోషల్‌ మీడియా లూనా మరణం సంచలనంగా మారింది. కాస్మటిక్‌ సర్జరీలను ఆశ్రయించే వారికి హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *