సురేశ్ కొండేటికి మరో బిగ్ షాక్, ఇక ఇండస్ట్రీ నుంచి కూడా..?

కొన్ని కీలక అంశాలపై చర్చించేందుకు.. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, క్రిటిక్స్ అసోసియేషన్ కలిశాయి. వీళ్లకు మరికొంతమంది పీఆర్వోలు కూడా కలిశారు. అంతా కలిసి ఓ జాయింట్ కమిటీగా ఏర్పాటై, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాల్లో భాగంగా వివాదాస్పద సురేష్ కొండేటిని కొంతకాలం పాటు ప్రెస్ మీట్స్ కు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే గోవాలో ఇటీవల జరిగిన సంతోషం ఫిలిం అవార్డుల వేడుకలో జరిగిన గందరగోళం గురించి అందరికి తెలిసిందే.

వేడుక మధ్యలోనే కరెంట్ పోవడం, సెలబ్రిటీల ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సురేశ్ కొండేటి వేడుక నిర్వహణ సరిగ్గా నిర్వహించలేదని, దీంతో టాలీవుడ్ కు అపకీర్తి తెచ్చిపెట్టాడని బడా నిర్మాతలు విమర్శించారు. ఇక ఈ విషయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు నిర్మాతల మండలి ఒక నోటీసును సైతం అతనికి ఇచ్చింది. వీటిపై స్పందించిన సురేశ్ కొండేటి తప్పు దొర్లిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే తాము పంపిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వలేదని నిర్మాతల మండలి తెలిపింది. ఇదిలా ఉండగా..

తాజాగా డిసెంబర్ 25 సోమవారం రోజున సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఫిల్మ్ క్రిటిక్ అసోషియేషన్ (FCA)ఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో FCA అధ్యక్షుడిగా ఉన్న సురేశ్ కొండిటి అంశంపై చర్చించారు. అందులో భాగంగానే ఫిలిం ఛాంబర్ గోవా ఫిలిం అవార్డు వేడుకలోనే పరిశ్రమ పరువుపోయిందని భావించి.. ఎఫ్ సీఏకు సురేశ్ కొండేటిపై చర్చలు తీసుకోవాలని లేఖ రాసింది. తాజాగా జరిగిన ఈ మీటింగ్ లో సుదీర్ఘ విచారణ తర్వాత ఎఫ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్న సురేశ్ కొండేటిని తొలగిస్తున్నట్లు ఈసీ ఏకగ్రీవ తీర్మానించిందని ఫిలిం క్రిటిక్స్ ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇప్పటికే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి నుంచి సురేశ్ కొండేటిని తొలగించినట్లు తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మీడియాకు తెలిపారు. మరి సురేశ్ కొండేటిని ఎఫ్ సీఏ అధ్యక్షుడిగా తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *