హీరో సుమన్ జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరో తెలిసింది.

సుమన్ జీవితంలో జరిగిన వివాదాస్పద సంఘటన ఆయన కెరీర్ కి పెద్ద మైనస్ అయింది. ఆ సంఘటన తర్వాత సుమన్ కెరీర్ నెమ్మదించింది. దర్శక నిర్మాతలు సుమన్ కాల్ షీట్స్ కోసం ఎదురుచూసేవారు. అంతలా క్రేజ్ తో సుమన్ దూసుకుపోతున్న సమయంలో ఆయనపై నీలిచిత్రాల వివాదం పిడుగులా పడింది. అయితే అప్పట్లో తమిళనాడులో పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్‌ కాంట్రాక్టర్‌ (వడియార్‌) వీళ్ల ముగ్గురి వల్లే సుమన్‌ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఆ సమయంలో లిక్కర్‌ కాంట్రాక్టర్‌ చాలా పవర్‌ ఫుల్‌ అలాంటి వ్యక్తి కూతురిని సుమన్‌ ఫ్రెండ్‌ ఒకరు ప్రేమించాడు. మరోవైపు హీరో సుమన్‌ అంటే ఆ రాష్ట్ర డీజీపీ కూతురికి చాలా ఇష్టం. సుమన్‌ విషయంపై డైరెక్టర్‌ సాగర్‌ ఇలా చెప్పారు.

‘ఒకరోజు సుమన్‌ను ఎంజీఆర్‌ తన ఇంటికి పిలిచి పరోక్షంగా డీజీపీ కూతురికి దూరంగా ఉండాలని సూచించాడు. దీంతో సుమన్‌ కూడా చెప్పాల్సింది నాకు కాదు ఆ అమ్మాయికి అన్నాడు. అక్కడ ఎంజీఆర్‌కు కొంతమేరకు కోపం వచ్చింది. అలా ఒకరోజు అందరూ చూస్తుండగా నడిరోడ్డులో సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పుడు సుమన్‌పై ఇలాంటి తప్పుడు కేసు పెట్టడంతో పాటు బెయిల్‌ రాకుండా ఉండే పలు సెక్షన్స్‌ నమోదు చేశారు. కానీ అప్పట్లో సుమన్‌పై చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దాలే. సుమన్‌ ఫ్రెండ్‌కు వీడియో క్యాసెట్ల షాప్‌ ఉండేది.

అక్కడికి చాల మంది అమ్మాయిలు వచ్చేవారు కాబట్టి ఈజీగా ఇలాంటి కేసును సుమన్‌పై నమోదు చేశారు. ఇదే సమయంలో సుమన్‌ అరెస్ట్‌ కాబోతున్నాడని నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి ముందే తెలుసు. ఆ సమయంలో సుమన్‌తో తీయాల్సిన సినిమా ఆపేశాడు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగినా ఆయన తిరిగి సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేసు​కున్నారు. సుమన్‌ అమ్మగారికి అప్పటి గవర్నర్‌ PC అలెగ్జాండర్ క్లాస్‌మేట్‌ కావడంతో జరిగిన విషయాన్ని ఆయనకు చెప్పడంతో బెయిల్‌ లభించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా సుమారు ఆరు నెలలు జైలు జీవితాన్ని సుమన్‌ గడిపాడని ఆయన తెలిపాడు.

జైలుకు వెళ్తున్న సమయంలో సుమన్‌ వద్ద ఉన్న డబ్బు,పలు ఆస్తి కాగితాలను తన స్నేహితులకు ఇచ్చాడట. అతను రిలీజ్‌ అయి బయటకు వచ్చాక వారందరూ కూడా సుమన్‌ను మోసం చేసి డబ్బు ఎగ్గొట్టారని ఆయన తెలిపాడు. అప్పట్లో సుమన్‌ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆ సమయంలో అతని మేనేజర్‌ సారథినే కొంత సాయం చేశారు. తర్వాత మళ్లీ పలు సినిమాలు తీసి జీవితంలో నిలదొక్కున్నాడని సుమన్‌ గురించి పలు ఆసక్తకరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ సాగర్‌ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *