ఇప్పుడు పలు షోస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అడపాదడపా సినిమాల్లో కూడా సందడి చేశాడు. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన లైఫ్ జరిగే ప్రతి విషయాన్ని అవినాష్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు. అయితే జబర్దస్త్‌లో వినోదభరితమైన స్కిట్ లతో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా కామెడీ పంచి పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. తాజాగా తన భార్య గురించి షాకింగ్ వార్త బయటపెట్టాడు. అవినాష్ భార్య తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో చురుకుగా ఉంటారు. అందులో అవినాష్ కు సంబంధించిన వీడియోలు పెడుతుంటారు.
రెండు సంవత్సరాల క్రితం అవినాష్ వీరిద్దరి వివాహం జరిగింది. ఈ జంట ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. తమ జీవితాల్లోని వివిధ అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. బిగ్ బాస్ లో తన సత్తా చాటుతూ సంచలనంగా మారిన అవినాష్ షో తర్వాత కూడా తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నాడు. గత సంవత్సరం ఏప్రిల్‌లో తమ మొదటి బిడ్డను పొందడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు అవినాష్ తెలిపారు. తమ ప్రయాణాన్ని డాక్యుమెంట్ గా కూడా తీశారు. గర్భం దాల్చినప్పటి నుండి క్షణాలను వీడియోలో పంచుకున్నారు. సన్నిహితుల మధ్య సాంప్రదాయ శ్రీమంతం వేడుకతో సహా అన్నీ గ్రాండ్ గా తీశారు.
అయితే తాజాగా అవినాష్ ఓ విషాదకర వార్తను బయటపెట్టాడు. తమ పుట్టబోయే బిడ్డను కోల్పోయినట్టు అవినాష్ బాధాతప్త హృదయంతో తెలిపారు. గుండెలు పగిలే వార్తను పంచుకున్నాడు. ఆత్రంగా ఎదురు చూసినా తల్లిదండ్రులు కాలేకపోయారనే బాధను వ్యక్తం చేశారు. తన అభిమానుల నుండి తనకు , తన భార్యకు లభించిన మద్దతుకు అవినాష్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సమయంలో తమను ఒంటరిగా వదిలేయాలని.. మరిన్ని వివరాలను లేదా వ్యాఖ్యానించవద్దని వారిని కోరాడు. ఈ నష్టం యొక్క బాధ అలాగే ఉంటుందన్నారు.