హీరోయిన్స్ అందంగా లేకపోతే సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు.అందుకే స్క్రీన్ పై అందంగా కనిపించడానికి, స్టార్ ఇమేజ్ ని కొనసాగించడానికి కొందరు హీరోయిన్స్ సర్జరీలు చేయించుకోడానికి కూడా వెనకాడలేదు. అయితే ప్లాస్టిక్ సర్జరీ అందాలే ఆయా హీరోయిన్లు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణమయ్యాయి.అందంగా ఉంటే దశాబ్దమైనా హీరోయిన్ గా రాణించేందుకు అవకాశం ఉంటుంది.అందువల్లే నేటి తరం హీరోయిన్లు అందం కోసం ఎంతైనా వెచ్చిస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటున్నారు.
శృతిహాసన్.. కమల్ హాసన్ కూతురిగా, స్టార్ హీరోయిన్ గా, సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ పెదాలకు సర్జరీ చేయించుకున్నట్టు శృతిహాసన్ బహిరంగంగా వెల్లడించారు.పెదాలతో పాటు ముక్కుకు కూడా శృతి కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారు.2009లో బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ సినిమాలతో శృతి కెరీర్ ను ప్రారంభించారు.ఆ సినిమాలో శృతి లుక్స్ పై కొంత విమర్శలు రావడంతో తరువాత కాలంలో ఆమె సర్జరీ చేయించుకున్నారు. నయనతార..2003లో మలయాళం సినిమాతో నయన్ తన ఫిల్మ్ కెరీర్ ను ప్రారంభించింది.
చంద్రముఖి సినిమాలో నటించిన తరువాత నయనతార ప్లాస్టిక్ సర్జరీ ద్వారా లోపాలను సరి చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఆ తరువాత కూడా నయన్ పలుమార్లు ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకుంది.ఈ ప్లాస్టిక్ సర్జరీల వల్లే ఇప్పటికీ నయన్ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. సమంత.. టాలీవుడ్ లో నేటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత 2012లో ముక్కుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది.ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సామ్ అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకుంటోంది.
శ్రియ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా అవకాశాలు అందుకున్న నటీమణులలో శ్రియ ఒకరు.మల్లన్న సినిమాకు ముందు శ్రియ సర్జరీ ద్వారా పెదాల రూపాన్ని మార్చుకున్నారు.పై పెదవిని విల్లు రూపంలో మార్చుకుని శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ నేటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అసిన్.. 2001లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన అసిన్ వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.ఘర్షణ, శివమణి, గజిని, అన్నవరం సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టారు.