పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని పవన్ కళ్యాణ్ మంచి కోరుకునే వ్యక్తులలో నేను కూడా ఒకడినని వేణుస్వామి చెప్పుకొచ్చారు. నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని కోరుకుంటానని ఆయన కామెంట్లు చేశారు. పవన్ ముఖ్యమంత్రి కావాలని భావించే వ్యక్తులలో తాను కూడా ఒకడినని వేణుస్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ కు కుటిల రాజకీయాలు తెలియవని వేణుస్వామి తెలిపారు.
అయితే పవన్ కల్యాణ్‌కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదు. ఆయన ఎవరి మాటలు వినరు. నేను పవన్ కల్యాణ్ గురించి మంచి చెప్పినా ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు. మంచి చెప్పినప్పుడు గ్రహించాలి. ఎదుటివాళ్లు ఎందుకు చెబుతున్నారో అర్దం చేసుకోవాలి అని వేణుస్వామి అన్నారు. పవన్ కల్యాణ్ అంటే నాకు పిచ్చి.
ఆయన బాగుపడాలని కోరుకొనే వాళ్లలో నేను ఒకరిని. ఆయన నటించిన 10 సినిమాలకు ముహుర్తం పెట్టినా.. ఆయనతో గంటలు గంటలు గడిపాను. నాకు చాలా ఇష్టం. ఆయనపై ఇష్టం వేరు. నాకు తెలిసిన ప్రతీ వ్యక్తి అభివృద్దిలోకి రావాలి. నా కోరిక అదే తప్పా.. నాకు శత్రువులు మిత్రులు లేరు అని వేణు స్వామి స్పష్టం చేశారు.