రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత షర్మిల భుజాలపై పడింది. క్షేత్రస్థాయిలో అందరిని కలుపుకొని వెళుతున్నారు. పార్టీలోకి కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. యువతరం నేతలతో షర్మిల చర్చిస్తున్నారని తెలిసింది. వైఎస్ఆర్‌తో అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం.
కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు తన తండ్రి వైఎస్సార్, ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటులో పోటీ కోసం ప్లాన్ చేస్తున్న షర్మిల.. తన సోదరి, బాబాయ్ వివేకా కుమార్తె సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే అవకాశం ఉంది.
లేకపోతే పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలో రెండు సీట్లను పోటీకి పరిశీలిస్తున్నారు. ఇందులో విజయవాడ తూర్పు సీటుతో పాటు గుంటూరు పశ్చిమ సీటు ఉన్నాయి. ఈ రెండు సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనుక కీలక కారణాలున్నాయి.