గత ఏడాది నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభ సమయంలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్య.. వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి మరదలు కుమార్తె. సామాజిక వర్గాలు వేరైనప్పటికీ.. అప్పటికే అలేఖ్యకు పెళ్లయి విడాకులు తీసుకున్నప్పటికీ..
రాజకీయంగానూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహానికి అవేవీ అడ్డు రాలేదు. తారకరత్న భార్య తన కూతురని చెప్పే విజయసాయి రెడ్డి.. తన అల్లుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో బెంగళూరు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, డాక్టర్లతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.తారకరత్న మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన షర్మిల.. ఆమెను ఓ సోదరిలా ఓదార్చారు. విజయసాయి రెడ్డితోపాటు.. ఇతర నందమూరి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన షర్మిల వారికి ధైర్యం చెప్పారు.