‘భారీ ఓటమి ఖాయమనే ధీమాతో జగన్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టి, పత్రికలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడికి పురిగొల్పుతున్నారు. ఈ హింసాత్మక చర్యలు, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఆఖరి ప్రయత్నం.
రాష్ట్రంలో 50 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’ అని చంద్రబాబు అన్నారు. కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడాన్ని నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇటీవల ఆంధ్రజ్యోతి, టీవీ5, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్‌పై దారుణంగా దాడి చేసి తీవ్ర గాయపర్చడం అనాగరికమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.