తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా కూడా జగన్ ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కనబెట్టేసి ఉదయాన్నే వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాంటిది ఆయన ఎన్నడు లేని విధంగా తన షెడ్యూల్‌ను 8 తేది సాయంత్రానికి మార్చుకున్నారు.
తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలను కలవకూడదనే జగన్ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారని జనం చర్చించుకుంటున్నారు. దీంతో ఈ విషయం కడపలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది వర్ధంతి కార్యక్రమానికి షర్మిల హాజరవగా.. అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ కావడంతో రాత్రికి రాత్రే ఆమె హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
ప్రతిసారి 8 తేది ఉదయం 8 గంటలకు జగన్ రెడ్డి వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించే వారు. మొదటి సారిగా 8 తేది సాయం త్రానికి షెడ్యూల్‌ను మార్చుకుని హాట్ టాపిక్‌గా మారారు.