విజయకాంత్ చనిపోయారనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. జలుబు, జ్వరంతో హాస్పిటల్ లో చేరిన ఆయన..సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అవుతారు అనుకుంటే.. దాదాపు 10 రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్నారు. దాంతో విజయ్ కాంత్ చనిపోయారని వందంతులువ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత ఈ విషయంలో స్పందిచారు… కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని… తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు.
వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని… త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు. అయితే విజయ్ కాంత్ తమిళనాడులో ప్రస్తుతం దేశీయ ముర్పొక్కు ద్రవిడ కఝగం పార్టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. విజయ్ కాంత్ విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుండి రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) రాజకీయ పార్టీ వ్యవస్థాపించాడు. ఆ పార్టీకి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అతనే.
ఇక విజయ్ కాంత్ పూర్తి పేరు.. విజయరాజ్ అలగర్‌స్వామి 1952 ఆగస్టు 25లో జన్మించారు. ఇక విజయ్ కాంత్ కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు తెలుగులో ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తమిళ్‌లో వందలాది సినిమాల్లో హీరోగా నటించారు. నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారారు. విజయ్ కాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 70 ఏళ్ల విజయ్ కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.