షర్మిల కోడలు బ్యాగ్రౌండ్ ఇదే, చంద్రబాబు చుట్టం కావడంతో..?

ప్రియా అట్లూరికి విజయమ్మ చీర పెట్టిన ఫోటో నెట్టింట వైరల్ కాగా త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్తను వింటామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రియా అట్లూరి తన టాలెంట్ తో మాస్టర్స్ పూర్తి చేశారని రాజారెడ్డి కూడా అక్కడే చదవడంతో ఇద్దరి మధ్య పరిచయం మొదలైందని ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం అందుతోంది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజా రెడ్డి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది.

ప్రియా అట్లూరి అనే యువతిని ఆయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రాజా రెడ్డి, ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఉండగానే.. ఇక తాజాగా వైఎస్ విజయమ్మ.. ప్రియాను కలిసిన ఫోటో బయటకు రావడంతో.. పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ప్రియాకి విజయమ్మ చీర పెట్టి, బంగారు గాజులు బహుకరించారని తెలుస్తోంది. విజయమ్మ కూడా ప్రియాను కలవడంతో.. వీరి పెళ్లి కన్ఫామ్ అయినట్లే అంటున్నారు.

ఈ క్రమంలో షర్మిలకు కాబోయే కోడలు ప్రియా గురించి ఆరా తీస్తున్నారు. అయితే గతంలోనే ప్రియా-రాజా రెడ్డి కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చినప్పుడు.. ఆమె చట్నీస్ హెటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా ప్రచారం సాగుతోంది. కానీ కొందరు మాత్రం.. ప్రియా అట్లూరి.. బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కుమార్తె అంటున్నారు. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్‌కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తెనే ఈ ప్రియా అని కొందరు అంటున్నారు.

పైగా జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియ మెస్ యజమానులు ప్రియ మేనమామలు అని కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ప్రియా కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారని.. ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉందని అంటున్నారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని సమాచారం. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది. షర్మిల కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే.. ప్రియా గురించి అధికారికంగా పూర్తి వివరాలు తెలుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *