షణ్ముఖ్ గంజాయి కేసులో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. తన అన్న సంపత్ ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో పోలీసులు అతని ఇంటికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా షణ్ముఖ్, అతడి అన్న సంపత్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
2016 లో Thik shake ప్రాంచైజ్ పేరుతో ఓ యువతి నుంచి 20 లక్షలు తీసుకుని మోసం చేశాడు షణ్ముఖ్ అన్న సంపత్. సంపత్ mba క్లాస్స్మేట్ అయిన యువతికి మాయమాటలు చెప్పి 20 లక్షలు పెట్టుబడి పేరుతో కాజేశాడు. 20 లక్షలు తీసుకుని నెలకు 7వేలు మాత్రమే లాభం అని చెప్పిన సంపత్. మోసపోయామని గుర్తించి ఇచ్చిన డబ్బులు అడగగా యువతిని బ్లాక్ మెయిల్ చేశాడట. ఒక్కొక్కరుగా బయటకొస్తున్న షణ్ముఖ్ సోదరుడు సంపత్ బాధితులు. ఇప్పటికే ఓ యువతీ తో నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహం ఆరు రోజులు ఉండగా మరో యువతి డాక్టర్ దివ్య పూజను వివాహం చేసుకున్నాడు సంపత్.
ఈ మహానుభావుడికి అప్పటికే ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలియక మరో అమ్మాయి మోసపోయింది. అంతే కాదు ముంబై లో మరో యువతిని వివాహం చేసుకున్నాడు సంపత్. గత కొన్నేళ్లుగా సంపత్ అతనితో పాటు షణ్ముఖ్ వారి ఫ్లాట్ లో గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు. అలాగే షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు ఇప్పిస్తాను అని పలువురు అమ్మాయిలను మోసం చేశాడు షణ్ముక్.