అక్కనే మించిపోయిన సాయి పల్లవి చెల్లి, ఈ వీడియో చూస్తే పూజాకి ఫ్యాన్ అయిపోతారు.

తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన సహజ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది. ఆ క్రేజ్‌తోనే ఆమెకు లేడీ పవర్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు ప్రేక్షకులు. అంతేకాదు సాయి పల్లవిని డ్యాన్స్ క్వీన్ అంటారు. తాజాగా సాయి పల్లవి మాస్ డ్యాన్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.

ఆ రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంతో సరదాగా, ఆనందంగా గడిపారు. ఆరోజు సాయి పల్లవి ఎంతో ఆనందంగా డాన్స్ చేసింది. తీన్ మార్ ఆడింది. అప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి. కానీ, తాజాగా ఆమె సోదరి పూజా మరో వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఆ వీడియోలో సాయి పల్లవికి మించి ఫుల్ జోష్ లో పెళ్లి కొడుకుతో కలిసి పూజా డాన్సులు వేసింది. ప్రస్తుతం ఆ రీల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ పూజా టాలెంట్ ని తెగ మెచ్చుకుంటున్నారు.

ఎంతైనా సాయి పల్లవి సిస్టర్ కదా.. ఆ మాత్రం ఉంటుందిలే. అక్కే అనుకుంటే చెల్లి డాన్స్ ఇంకా ఇరగదీస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఎంగేజ్మెంట్ అంటే ఇలా చేసుకోవాలి, ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా అంటున్నారు. మరి.. డ్యాన్స్ లో అక్కనే దాటేసిన చెల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *