బుల్లితెర మీద తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. పలు సక్సెస్ ఫుల్ షోలకు సుమ యాంకరింగ్ చేశారు. అయితే కొన్నాళ్లుగా ఆమె హవా తగ్గుతూ వస్తుంది. గ్లామరస్ యాంకర్స్ సత్తా చాటుతున్న తరుణంలో సుమ చేస్తున్న షోల సంఖ్య తగ్గింది.
అయితే వైవా హర్ష ప్రధాన పాత్రలో వస్తున్న సుందర మాస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ కనకాలను యాంకర్ గా పిలిచారు. అయితే ఎప్పటిలాగే.. సినిమా స్టైల్ లో యాంకరింగ్ చేసేందుకు వచ్చేసిందీ ముద్దుగుమ్మ. అయితే సినిమాలోని అనేక విషయాల గురించి చెబుతూ..
అందులోని నటీనటులును స్టేజీ మీదకు పిలుస్తూ.. చాలానే సందడి చేసింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ కనకాల కొడుకు హీరో రోషన్ కనకాల కూడా వచ్చాడు. అయితే కొడుకును స్టేజీ మీదకు పిలిచిన సుమ చాలా గట్టిగా ఫైర్ అయింది.