రోజా సెల్వమణి గా పేరు గాంచిన శ్రీలతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
అయితే దక్షిణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. సామాన్యులకు ఒకలా.. వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒకలా రూల్స్ పెట్టడంపై తీవ్ర అభ్యర్థరాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ముక్కంటి ఆలయంలో కొన్ని నియమాలు కచ్చితంగా అమలు చేస్తున్నారు ఆలయ అధికారులు. అదే నిబంధనలు విఐపి వరకు వస్తే.. వాటినే తుంగలో తొక్కాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
భూతనాధుడి ఆలయంలో ఆలయ అర్చకులు వెలిగించే దీపాలు మినహా.. భక్తులు వెంట తెచ్చుకోండి దీపాలు., వివిధ రకాల నేతితో వెలిగించేందుకు ఉపయోగించే వస్తువులను అనుమతించారు. విఐపిల విషయంలో అందుకు బిన్నంగా ఈ ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజా చర్య తీవ్రవిమర్శలకు తావిస్తోంది.