శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్, అదే దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి, సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఈయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్ కి సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది. గతంలో ఓ టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేసింది.
ఆయన “రాతిమేఘం” అనే నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద, “క్రేజ్” అనే నవల క్రికెట్ మీద, “అర్ధాగ్ని” అనే నవల సతీ సహగమనానికి వ్యతిరేకంగానూ రాశారు. తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు.
ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు. “వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి….,”అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు.