ఇక ఏ ఆట అయినా ఇష్టంగా ఆడే రోజా గతంలో భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడగా, ఇప్పుడు మళ్ళీ కబడ్డీ ఆటలో కూత పెట్టారు. పర్యాటక శాఖ మంత్రి రోజా తొడగొట్టి సవాల్ విసురుతూ కబడ్డీ ఆడారు.
కాకినాడలోని ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ(పురుషులు) టోర్నమెంట్ లో పాల్గొన్న మంత్రి రోజా ఆటగాళ్ళతో పాటు కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. కబడ్డీ మాత్రమే కాదు ఏ ఆటైనా ఆడే రోజా క్రీడల పట్ల తన మక్కువను ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటారు.
ఇక తాజాగా ఆమె తొడ కొట్టి మరీ కబడ్డీ ఆడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్కే రోజా అటు నటనలోనూ, ఇటు రాజకీయాలలోనే కాదు. ఆట పాటల్లోనూ ఆమె మల్టీ టాలెంటెడ్. ఈ సందర్భంగా రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.