చంద్రబాబు ఇంటికి వెళ్లి షర్మిల ఏం మాట్లాడరో చుడండి.

వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించానని చెప్పారు. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరానని తెలిపారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని… సాధారణ భేటీగానే చూడాలని కోరారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవలే తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి హరీష్ రావు, తదితరులను ఇప్పటికే ఆహ్వానించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా వైఎస్ షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వైఎస్‌ షర్మిల.. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల చెప్పారు.

ఈ సమావేశంలో రాజకీయాలపై చర్చించలేదన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు షర్మిల. ఇక కాంగ్రెస్‌ పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా..క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నిర్వహిస్తానన్నారు.. షర్మిల. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం వైఎస్‌ఆర్‌ కల అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *