గత ఏడాది మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక గీతానికి బంజారా మహిళలతో కలిసి హుషారుగా అంబటి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లది అపవిత్రమైన పొత్తు, వచ్చే ఎన్నికల్లో వారి పొత్తును ప్రజలు తగలేస్తారని అన్నారు.
అయితే సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు తెగ సందడి చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ లో ‘సంబరాల రాంబాబు’ అని ఏ మూహార్తాన అన్నాడో కానీ అచ్చం అలానే… అంతకుమించిన డ్యాన్సులతో ఇరగదీశాడు.. అప్పట్లో అంబటి రాంబాబు పలు సినిమాల్లోనూ నటించాడని టాక్.
ఈ మధ్య మొత్తం నల్ల జుట్టును వదిలేయడంతో తెల్లగా మారిపోయింది. రంగేసుకున్నాడని అర్థమైది. అయితే తాజాగా సత్తెన పల్లిలో అంబటి రాంబాబు భోగి మంటలు వేసి గిరిజనులతో కలిసి చిరంజీవి స్టైల్లో వేసిన స్టెప్పులు ఉర్రూతలూగించాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంబటి రాంబాబు డ్యాన్సుల వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.