మంత్రి ఆర్కే రోజా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేశారు. ఆయన యాక్సిడెంటల్ సీఎం అంటూ తెలిపారు. అయితే తాజాగా బండ్ల గణేష్.. మంత్రి రోజా చేసిన కామెంట్లపై స్పందించారు. కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఏపీ మంత్రి రోజాపై మండిపడ్డారు. ఆమె ఓ డైమండ్ రాణి అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని బండ్ల గణేష్ అన్నారు. ఆమె పని చేస్తున్న పార్టీ అధినేతనే యాక్సిడెంట్ సీఎం అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అంతేకానీ, రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. రోజా తరహా ఇక్కడ చేపల పులుసు వండి పెడితే పదవులు రావని విమర్శించారు.
రోజాతోపాటు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పైనా బండ్ల గణేష్ కామెంట్లు చేశారు. ఎన్నికల్లో ఓటమితో కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని అన్నారు. పగవాళ్లకు కూడా ఆయన పరిస్థితి రావొద్దంటూ పేర్కొన్నారు. కేటీఆర్‌కు ఈగో ఎక్కువ అని చెప్పారు. వైఫై తరహా ఆయన చుట్టూ ఈగో ఉంటుందని ఆరోపించారు. త్వరలోనే కేటీఆర్‌కు మరిన్ని కష్టాలు తప్పవని పేర్కొన్నారు. కేసీఆర్ కొడుకు అనేది తప్పితే మరో గుర్తింపు ఆయనకు లేదని చెప్పారు.