గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపారు.
కానీ వాళ్లెవరూ రాలేదు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటూ.. మరో 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్‌రెడ్డి తొలి ఫైల్ పైన సంతకం చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీ పథకాల అమలు పైన సంతకం చేయాలని నిర్ణయించారు. పార్టీ అగ్రనేతలు..అతిధులు..కొత్త మంత్రులు..పార్టీ శ్రేణుల సమక్షంలోనే సంతకం చేయాలని డిసైడ్ అయ్యారు.
2004లో వైఎస్సార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పైన ప్రమాణ స్వీకార వేదిక పైనే సంతకం చేసారు. ఇప్పుడు రేవంత్ అదే తరహాలో సంతకానికి సిద్దమయ్యారు. ఆ తరువాత 9న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాల అమలు తీరు తెన్నులను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో ప్రస్తుత ఆర్దిక పరిస్థితులు రేవంత్ కు సవాల్ గా మారుతున్నాయి.