ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి సీట‍్లను గెలిచింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిపై చర్చ మొదలైంది. రాత్రికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. సోమవారంమే ప్రమాణస్వీకారం ఉంటుదన్న లీకులు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఓడిపోయింది ఒక్కసారే. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో సిద్దిపేట నియోజకవర్గంలో మదన్మోహన్ చేతిలో ఓడిపోయారు.
దాదాపు 30 సంవత్సరాల తర్వాత.. ఇప్పుడు కామారెడ్డి లో ఓడిపోవడం విశేషం. గజ్వేలులో భారీ మెజారిటీతో గెలుపొందడం ఊరటనిచ్చే విషయం. ఎంతోమంది నాయకులకు కెసిఆర్ అవకాశమిచ్చారు. పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించారు. కానీ ఈ ఎన్నికల్లో తాను ఒకచోట ఓడిపోవడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పడి లేచిన కెరటంలా కెసిఆర్ కు దెబ్బ కొట్టింది. రాజకీయ గుణపాఠం నేర్పింది.
64 సీట్లతో తెలంగాణలో బాగా వేసింది. ఇనపద్యంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఇవాళ జరగనుంది. ఇందుకు హైదరాబాద్ నగరంలోని ఎల్లా హోటల్ వేదిక కానుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలంగాణ సీఎం ఎవరనే దానిపై ఎమ్మెల్యేల నుంచి వివరాలు సేకరించనున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. హై కమాండ్ ఆయన పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.