తనకు పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా హైదరాబాద్ లో శనివారం రాత్రి చిరంజీవి ముఖ్యులకు విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలిపారు.
అవార్డు ప్రకటన సందర్బంగా చిరంజీవి విందు ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడారు. చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తనను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. 2006 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. చిరంజీవితో పాటు ఉపరాష్ట్రపతిగా సేవలందించిన వెంకయ్య నాయుడు సైతం పద్మవిభూషణ్ అందుకోనున్నారు.