ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు హాజరయ్యే క్రమంలో ప్లకార్డుతో బయట నిరసన తెలిపారు. అయితే తన నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోటంరెడ్డి నిరసనకు దిగారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందని స్పష్టం చేసారు.
నాలుగేళ్ల కాలంలో సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయానని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించేందుకు మైక్ ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటానని చెప్పారు. అదే విధ:గా తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుంటే నిలబడి నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేసారు.
కోటంరెడ్డికి అసెంబ్లీకి హాజరయ్యే సమయంలో అమరావతి స్థానికులు పచ్చ కండువా కప్పి తమ మద్దతు ప్రకటించారు. ప్లకార్డుతోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు కోటంరెడ్డి ప్రయత్నించారు.