పెయిర్ చాలా క్యూట్‌గా ఉందని, కలిసి సినిమాలో కనిపించాలని నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్, శోభితా కలిసి నటించిన యాడ్‌లో ఇద్దరూ భార్యభర్తలుగా కనిపించారు. అయితే ఫోటోలను బట్టి చూస్తే ఇదొక వెడ్డింగ్ కి సంబంధించిన యాడ్ అని తెలుస్తోంది.
ఈ ఫోటోలో శోభిత ధూళిపాళ్ల పెళ్లికూతురుగా ముస్తాబై పెళ్లి మండపంలో కూర్చుంది. ఆమెకు ఎదురుగా రామ్ చరణ్ పట్టు వస్త్రాల్లో పెళ్ళికొడుకు గెటప్ లో కనిపించాడు. రామ్ చరణ్, శోభిత వెడ్డింగ్ షూట్ పేరుతో నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోల్లో రామ్ చరణ్ ని పెళ్లి కొడుకు గెటప్ లో చూసిన ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాకుండా ఈ లుక్ లో రామ్ చరణ్ అదిరిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శోభిత దూళిపాళ్లతో కలిసి రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ చేస్తున్న యాడ్ షూట్ ఇది. అయితే ఈ యాడ్ బట్టలకు సంబంధించిందా? లేక ఆభరణాలకు సంబంధించిందా? అనేది తెలియదు.