గత ప్రభుత్వం చేసిన కుటుంబ సర్వేను బయటపెట్టాలని, ప్రజాధనంతో చేసిందన్నారు. ఆత్మగౌరవ భవనాలకు రూపాయి ఇవ్వలేదు. బీసీ బంధుకు రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కుల ఫెడరేషన్ ఉన్నాయని వాటికీ నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు. ఎంబీసీలకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించి ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కులగణన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అని… అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నామన్నారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. ఆ మాజీ మంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా అని ప్రశ్నించారు.